ఎన్నికల అధికారి సాయంతో కొప్పుల ఈశ్వర్ గెలిచారు: లక్ష్మణ్
ABN , First Publish Date - 2021-06-15T20:46:36+05:30 IST
రోళ్ల వాగు ప్రాజెక్టు పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడిచిన ఇప్పటికీ పూర్తికాలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు.
జగిత్యాల: రోళ్ల వాగు ప్రాజెక్టు పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడిచిన ఇప్పటికీ పూర్తికాలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. అక్కపెల్లి చెరువు లిఫ్ట్ నిర్మాణానికి నిధుల మంజూరును స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించారు. ధర్మపురి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ సెంటర్, జిల్లా ఆసుపత్రిలో వెంటిలేటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో అప్పటి జిల్లా ఎన్నికల అధికారి శరత్ సహకారంతోనే మంత్రి కొప్పుల ఈశ్వర్ గెలిచారని లక్ష్మణ్ ఆరోపించారు.