కారు దూకుడు..8వ రౌండ్‌లో 7948 ఓట్ల ఆధిక్యం

ABN , First Publish Date - 2021-05-02T16:21:48+05:30 IST

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి

కారు దూకుడు..8వ రౌండ్‌లో 7948 ఓట్ల ఆధిక్యం

నల్గొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భ‌గ‌త్‌ ముందంజలో ఉన్నారు. 8వ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌ 7,948 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. 8వ రౌండ్‎లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 3,249 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి 1,893 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రవికుమార్‌కు 74 ఓట్లు వచ్చాయి.

Updated Date - 2021-05-02T16:21:48+05:30 IST