కారు దూకుడు..12వ రౌండ్‎లో టీఆర్ఎస్ 10వేల ఓట్ల ఆధిక్యం

ABN , First Publish Date - 2021-05-02T17:24:39+05:30 IST

నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిస్తోంది. 12వ రౌండ్‎లో గులాబీ పార్టీ ఆధిక్యంతో దూసుకుపోతుంది...

కారు దూకుడు..12వ రౌండ్‎లో  టీఆర్ఎస్ 10వేల ఓట్ల ఆధిక్యం

నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిస్తోంది. 12వ రౌండ్‎లో గులాబీ పార్టీ ఆధిక్యంతో దూసుకుపోతుంది. 10వ రౌండ్‎లో కాంగ్రెస్ 175 ఓట్ల ఆధిక్యం సొంతం చేసుకోగా.. మిగతా రౌండ్లలో టీఆర్ఎస్ హవా నడుస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ముందంజలో దూసుకెళ్తున్నారు. 12 రౌండ్ ముగిసేసరికి 10,361 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 12వ రౌండ్‎లో టీఆర్ఎస్ అభ్యర్థి  భగత్‌కు 3,833 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,578 ఓట్లు వచ్చాయి.

Updated Date - 2021-05-02T17:24:39+05:30 IST