సాగర్‎ ఎన్నికలో టీఆర్ఎస్ దూకుడు..17, 18 రౌండ్లలో భారీ ఆధిక్యం

ABN , First Publish Date - 2021-05-02T18:47:04+05:30 IST

సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ దూకుడు కొనసాగుతోంది. 17వ రౌండ్‎లో టీఆర్ఎస్ 11,581 ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 17వ రౌండ్ ముగిసేసరికి

సాగర్‎ ఎన్నికలో టీఆర్ఎస్ దూకుడు..17, 18 రౌండ్లలో భారీ ఆధిక్యం

నల్గొండ: సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ దూకుడు కొనసాగుతోంది. 17వ రౌండ్‎లో టీఆర్ఎస్ 11,581 ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 17వ రౌండ్ ముగిసేసరికి అధికార పార్టీ టీఆర్ఎస్ 11,581 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తుంది. 17వ రౌండ్‎లో టీఆర్ఎస్‌ అభ్యర్థి భగత్‎కు 3,772 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి 2,349 ఓట్లు వచ్చాయి.

18వ రౌండ్‎లో టీఆర్ఎస్‎కు 13వేల ఓట్ల ఆధిక్యం

18వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. సాగర్‎లో ఇప్పటి‎కే విజయం దిశగా అడుగులు వేస్తోంది. 18వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్  13,396 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంది. 18వ రౌండ్‎లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‎కు 4,074 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,259 ఓట్లు రాగా, 18వ రౌండ్‎లో టీఆర్ఎస్ లీడ్ 1,851 ఓట్లు

Updated Date - 2021-05-02T18:47:04+05:30 IST