మరో వివాదంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ABN , First Publish Date - 2021-02-02T01:24:37+05:30 IST

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ నిధుల సేకరణకు సంబంధించి కొద్ది

మరో వివాదంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

హైదరాబాద్: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ నిధుల సేకరణకు సంబంధించి కొద్ది రోజుల కిందట ధర్మారెడ్డి ధర్మారెడ్డి ఒక  సమావేశంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇంతలోనే మరో వివాదంలో ధర్మారెడ్డి చిక్కుకున్నారు. ఓసీ మహాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ చిన్న కులాల అధికారులకు అక్షరం ముక్క రాదని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏ ఆఫీసుకు వెళ్లినా వాళ్లే ఉన్నతాధికారులుగా ఉన్నారని, ఇలాంటి వాళ్ల వల్లే రాష్ట్రం నాశనమవుతోందని ధర్మారెడ్డి ఆరోపించారు. ధర్మారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. 


అయోధ్యలో రామాలయ నిర్మాణ నిధుల సేకరణకు సంబంధించి తాను వ్యాఖ్యలను వక్రీకరించారని ధర్మారెడ్డి తెలిపారు. తనపై బురదజల్లేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యలు తప్పైతే ఆ వ్యాఖ్యలను విరమించుకుంటున్నానని ప్రకటించారు. నా వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై వివరించే క్రమంలో అలా మాట్లాడానని ధర్మారెడ్డి చెప్పారు.

Updated Date - 2021-02-02T01:24:37+05:30 IST