తప్పుడు గ్యారెంటీలతో మూడింతల రుణం!

ABN , First Publish Date - 2021-12-25T08:40:57+05:30 IST

బ్యాంక్‌ నుంచి అధిక రుణం పొందేందుకు తప్పుడు గ్యారెంటీలు

తప్పుడు గ్యారెంటీలతో మూడింతల రుణం!

  • నకిలీ పత్రాలు చూపి యూబీఐకి రూ.50 కోట్లకు టోపీ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బ్యాంక్‌ నుంచి అధిక రుణం పొందేందుకు తప్పుడు గ్యారెంటీలు చూపించారు. పొందాల్సిన దాని కంటే మూడు రెట్లు ఎక్కువగా రుణం లాగేశారు. రూ.50.18 కోట్ల మేరకు యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు కుచ్చుటోపీ పెట్టిన నిందితుల ఆట కట్టించారు సైబరాబాద్‌ పోలీసులు! సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపిన వివరాలివీ. సనత్‌నగర్‌కు చెందిన కట్టమీది సంతో్‌షరెడ్డి కాంట్రాక్టర్‌. తన స్నేహితులు నెక్కంటి శ్రీనివా్‌స, కొండకల్‌ గోపాల్‌, సోమవరపు సురేందర్‌రెడ్డితో కలిసి కంపాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీని స్థాపించాడు. వారంతా డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. కంపెనీ పేరున బ్యాంకులో రుణం పొందడానికి వారి ఆస్తులను గ్యారెంటీగా పెట్టాలని నిర్ణయించుకున్నారు.


అయితే ఆ ఆస్తుల మొత్తానికి 15 కోట్లు మాత్రమే రుణం వచ్చే వీలుంది. దీంతో తమ ఆస్తుల విలువను ఎక్కువగా చూపించేలా నకిలీ పత్రాలు సృష్టించారు. నకిలీ డాక్యుమెంట్లను కొండాపూర్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ శాఖకు సమర్పించారు. మొత్తం రూ.53,18,50,093 రుణంగా తీసుకున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో యూనియన్‌ బ్యాంకు ఏజీఎం ప్రకాశ్‌బాబు రంగంలోకి దిగారు. నిందితులు చూపించిన గ్యారెంటీలపై ఆరా తీశారు. ఆ పత్రాలన్నీ నకిలీవని తేలింది. దాంతో మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశాల మేరకు కేసును కమిషనరేట్‌లోని ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈవోడబ్ల్యూ)కు బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సిబ్బంది మోసం జరిగినట్టుగా ధ్రువీకరించారు. సంతో్‌షరెడ్డిని జూబ్లీహిల్స్‌లో అరెస్టు చేశారు. 

Updated Date - 2021-12-25T08:40:57+05:30 IST