బీఆర్ అంబేద్కర్‌కు నివాళి
ABN , First Publish Date - 2021-01-13T04:16:15+05:30 IST
బీఆర్ అంబేద్కర్‌కు నివాళి

భూపాలపల్లిటౌన్, జనవరి 12 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గౌరవ డాక్టరేట్ అందుకున్న రోజును పురస్కరించుకొని వివిధ సంఘాల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత మాట్లాడుతూ మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన ఉస్మానియా యూనివర్సిటీ 1953 జనవరి 12న అంబేద్కర్‌కు డాక్టరేట్ అందించి ఘనంగా సత్కరిం చిందని తెలిపారు. బహుజనుల కోసం స్థాపించిన హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ యూనివర్సిటీ ఆయన్ను గుర్తించడం గర్వకారణమన్నారు. దళిత మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేష్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు ఉదయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, ఆనంద్, రామస్వామి, బహుజన నాయకులు పొనగంటి సతీష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.