అన్ని జిల్లాల్లో అత్యాధునిక పోలీసు భవనాలు!

ABN , First Publish Date - 2021-06-21T10:08:05+05:30 IST

రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కమిషనరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు అత్యాధునిక భవనాలను నిర్మించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ప్రణాళికలు రూపొందించింది.

అన్ని జిల్లాల్లో అత్యాధునిక పోలీసు భవనాలు!

హైదరాబాద్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కమిషనరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు అత్యాధునిక భవనాలను నిర్మించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ప్రణాళికలు రూపొందించింది. సిద్దిపేట, కామారెడ్డిలో మాదిరిగానే ఈ భవనాలను నిర్మించాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు కసరత్తు చేసినట్లు ప్రకటించింది. వందేళ్లపాటు సేవలందించేలా కొత్త భవనాలను నిర్మించాలని పోలీసు శాఖ భావిస్తోంది. కొత్త భవనాల్లో పౌరులు, పోలీసు అధికారులతో సమావేశాల నిర్వహణకు విశాలమైన కాన్ఫరెన్స్‌ హాల్‌ నిర్మాణం, రిసెప్షన్‌ సెంటర్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, సైబర్‌ సెల్‌, డిజిటల్‌ ట్రైనింగ్‌, తదితర ప్రత్యేక విభాగాలు ఉంటాయని పేర్కొంది. 

Updated Date - 2021-06-21T10:08:05+05:30 IST