రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది:పువ్వాడ
ABN , First Publish Date - 2021-02-06T09:22:23+05:30 IST
రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది:పువ్వాడ

దమ్మపేట, పిబ్రవరి 5: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని, మోసకారి బీజేపీ మాటలు నమ్మొద్దని, సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్‌ఎస్ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ.. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీకి కట్టబెడుతుంటే బీజేపీ చూస్తూ ఉండిపోయిందని, భద్రాద్రి అభివృద్ధికి ఒక్క పైస నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు.