బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
ABN , First Publish Date - 2021-12-26T09:16:54+05:30 IST
జీవో 317 ప్ర కారం నూతన జిల్లాలకు జరుగుతున్న కేటాయింపులో అసమానతల్ని తొలగించి ఉపాధ్యాయులందరికీ బదిలీలు, పదోన్నతులు కల్పించాలని ఎస్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఎస్టీయూటీఎస్
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జీవో 317 ప్ర కారం నూతన జిల్లాలకు జరుగుతున్న కేటాయింపులో అసమానతల్ని తొలగించి ఉపాధ్యాయులందరికీ బదిలీలు, పదోన్నతులు కల్పించాలని ఎస్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాచిగూడలోని ఎస్టీయూ భవన్‌లో శనివారం రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశం జరిగింది. ఉపాధ్యాయుల ఇష్టంతో నిమిత్తం లేకుండా నూతన జోనల్ వ్యవస్థలో కేటాయింపులు జరుగుతున్నాయని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.సదానందగౌడ్, పర్వతరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.