హన్మకొండ జిల్లాలో విషాదం.. ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-12-19T21:22:04+05:30 IST

లో విషాద ఘటన చోటుచేసుకుంది. శాయంపేట మండలం పెద్దకోడెపాకలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

హన్మకొండ జిల్లాలో విషాదం.. ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం

హన్మకొండ: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శాయంపేట మండలం పెద్దకోడెపాకలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భూవివాదం విషయంలో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. దంపతులు అనిత, అశోక్‌రెడ్డి పురుగుల మందు తాగారు. కుమారుడికి పురుగుల మందు తాగించేందుకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకుని బాధితులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. దంపతులు అనిత, అశోక్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2021-12-19T21:22:04+05:30 IST