మూతబడిన బడులు తెరవండి: టీపీటీఎఫ్‌

ABN , First Publish Date - 2021-10-21T09:10:04+05:30 IST

రాష్ట్రంలో మూతబడిన స్కూళ్లను వెంటనే తెరవాలని..

మూతబడిన బడులు తెరవండి: టీపీటీఎఫ్‌

రాష్ట్రంలో మూతబడిన స్కూళ్లను వెంటనే తెరవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. 1201 స్కూళ్లలో పిల్లలు లేరని మూసివేయడాన్ని అశాస్త్రీయ చర్యగా భావిస్తున్నామని, విద్యాశాఖ అధికారులు వాటిని సందర్శించకుండానే, తల్లిదండ్రులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలపకుండానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఫెడరేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రమణ, మైస శ్రీనివాసులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ చర్యను సామజిక నేరంగా భావించాలని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-10-21T09:10:04+05:30 IST