రామమందిరం నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదు: పొన్నం

ABN , First Publish Date - 2021-02-03T20:04:05+05:30 IST

రామ మందిరం నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని, రాముడిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం సరికాదని

రామమందిరం నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదు: పొన్నం

కరీంనగర్: రామ మందిరం నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని, రాముడిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం సరికాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. రామాలయాన్ని కేంద్రం ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. ప్రజల విరాళాలతో కట్టడం ఎందుకు? అని అడిగారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బయటికి వచ్చి మంత్రి ఈటల బాగా మాట్లాడారు.. కేబినెట్ మీటింగులో కూడా మంత్రి ఇలానే మాట్లాడాలన్నారు. మంత్రి ఈటల లాగా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడాలని సూచించారు.

Updated Date - 2021-02-03T20:04:05+05:30 IST