రైతుల కోసం మాట్లాడితే రండలమా?

ABN , First Publish Date - 2021-10-29T08:26:12+05:30 IST

రైతుల కోసం పోరాటం చేస్తున్న తమను మంత్రి జగదీశ్‌రెడ్డి రండలు అంటున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రైతుల కోసం మాట్లాడితే రండలమా?

  • నీవు రండవా అని జగదీశ్‌రెడ్డిని ప్రశ్నించిన జగ్గారెడ్డి 
  • రైతుల పొట్టగొడితే మంత్రులు, కలెక్టర్ల వీపులు పగుల్తాయని హెచ్చరిక


హైదరాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రైతుల కోసం పోరాటం చేస్తున్న తమను మంత్రి జగదీశ్‌రెడ్డి రండలు అంటున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రులు ప్రతిపక్షాలను అలా తిట్టొచ్చా? మరి మీరు కేసీఆర్‌కు రండలా?’’ అని మంత్రిని ప్రశ్నించారు. వరి సాగుపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలు బంద్‌ చేయాలన్నారు. బీజేపీ-టీఆరెస్‌ రెండూ పాము-ముంగిస లాంటివని విమర్శించారు. కాంగ్రెస్‌ రైతుల పక్షాన పోరాడుతుందని,  నవంబరు 1 తర్వాత చలో సిద్దిపేట కార్యక్రమం చేపడతామన్నారు. రైతుల పొట్టకొడితే మంత్రులు, కలెక్టర్ల వీపులు పలుగుతాయని హెచ్చరించారు. వరి కొనకపోతే మంత్రులను అడ్డుకుంటామని, మరోసారి తమని రండలు అంటే నాలుక కోస్తామని హెచ్చరించారు. మంత్రులు జగదీ్‌షరెడ్డి, నిరంజన్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హితవుపలికారు. లేదంటే నడిరోడ్డుమీద బట్టలు విప్పేస్తామని  హెచ్చరించారు.

Updated Date - 2021-10-29T08:26:12+05:30 IST