టీఆర్‌ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పండి: ఉత్తమ్
ABN , First Publish Date - 2021-02-26T08:14:42+05:30 IST
రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని నివేదికలు చెబుతుంటే టీఆర్‌ఎస్ నేతలు మాత్రం తాము ఉద్యోగాలు భర్తీ చేశామని ఢంకా మోగిస్తూ అబద్ధాలు చెబుతున్నారని టీపీసీసీ

మహబూబాబాద్/ఇల్లెందు,ఫిబ్రవరి25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని నివేదికలు చెబుతుంటే టీఆర్‌ఎస్ నేతలు మాత్రం తాము ఉద్యోగాలు భర్తీ చేశామని ఢంకా మోగిస్తూ అబద్ధాలు చెబుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. నడిరోడ్డుపై హైకోర్టు న్యాయవాదులను హత్య చేయించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేననన్న విష యం బయటపడిందని, రాష్ట్రంలో పాలన ఏ రీతిలో ఉం దో అర్థం చేసుకోవచ్చన్నారు. మహబూబాబాద్‌లో గురువారం పట్టభద్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మం డలం సుదిమళ్లలో నిర్వహించిన సమావేశంలోనూ ఉత్త మ్ మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ పెంపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్వాహకమేనని విమర్శించారు. ఎమ్మె ల్సీ ఎన్నికల్లో రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రె్‌సను గెలిపించి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పలుపునిచ్చారు.
పీవీ ఫొటోతో ఓట్లు సిగ్గుచేటు: రేవంత్
ఎల్‌బీనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో దివంగత పీవీ నర్సింహ్మరావు పొటోతో టీఆర్‌ఎస్ ఓట్లు అడగడం సిగ్గుచేటని ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. గురువారం కర్మన్‌ఘాట్‌లో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.