కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా

ABN , First Publish Date - 2021-07-12T22:07:01+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. మరికాసేపట్లో ఆ పార్టీ నేతలకు లేఖను పంపనున్నారు. అధికారికంగా

కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా

కరీంనగర్:  కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. మరికాసేపట్లో ఆ పార్టీ నేతలకు లేఖను పంపనున్నారు. అధికారికంగా ఇవాళ సాయంత్రం ప్రకటించనున్నట్టు సమాచారం. 


గత కొద్దికాలంగా అధికార పార్టీకి కౌశిక్ దగ్గరగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేగాక తాజాగా విడుదలైన ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ టికెట్ తనకు ఖాయమయ్యిందంటూ కౌశిక్ స్వయంగా తెలపడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆడియో టేపుల వ్యవహారంపై 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలంటూ టీపీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆలోపే తన రాజీనామాను ప్రకటించారు కౌశిక్ రెడ్డి. 


ఇదిలా ఉంటే, కౌశిక్‌రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ హుజురాబాద్‌లో డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ తీర్మానం చేశారు. ఈ మేరకు హుజురాబాద్ ఇన్‌ఛార్జ్‌ దామోదర రాజనర్సింహకి లేఖ రాశారు.

Updated Date - 2021-07-12T22:07:01+05:30 IST