సిగ్గనిపించడం లేదా కేటీఆర్: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-11-01T03:24:52+05:30 IST

ఫ్రాన్స్ నుంచి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని, లక్షలాది ఉద్యోగాలు ఇస్తున్నామని, పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే ఇలా..

సిగ్గనిపించడం లేదా కేటీఆర్: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఫ్రాన్స్ నుంచి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని, లక్షలాది ఉద్యోగాలు ఇస్తున్నామని, పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే ఇలా చెప్పుకోవడానికి సిగ్గనిపించడం లేదా కేటీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మహేష్ తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత ఆవేదనతో అడుగుతున్న ప్రశ్న ఇది అని ఆయన పేర్కొన్నారు. మరణం కాదని, రణం చేద్దామని యువతకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 


మరోవైపు ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహేష్ తల్లిదండ్రులను ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ పరామర్శించారు. మహేష్ తల్లికి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి ధైర్యం చెప్పారు. Updated Date - 2021-11-01T03:24:52+05:30 IST