ముమైత్‌ ఖాన్‌తో పోలుస్తూ రేవంత్ రెడ్డిపై కౌశిక్ తీవ్ర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-07-12T23:05:21+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాణిక్కం ఠాగూర్‌‌కు రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ పదవి పొందారని ఆరోపించారు.

ముమైత్‌ ఖాన్‌తో పోలుస్తూ రేవంత్ రెడ్డిపై కౌశిక్ తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాణిక్కం ఠాగూర్‌‌కు రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ పదవి పొందారని ఆరోపించారు. మాణిక్కం ఠాగూర్ ఓ యూజ్ లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. 


‘‘రేవంత్ రెడ్డి కంటే ఉత్తమ్ రెడ్డి లక్ష రెట్లు నయం. కార్యకర్తల్లో ధైర్యం నింపారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాన్ని వదిలిపెట్టి రేవంత్ ఫొటోలు దిగుతున్నారు. సినిమా యాక్టర్‌లా రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నారు. టీపీసీసీ చీఫ్ పదవి వస్తే ముఖ్యమంత్రి అయినట్టు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి తాకట్టు పెడుతున్నారు. హుజూరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు పిచ్చోళ్లలా కనపడుతున్నామా... నువ్వు ఇంట్లో కూర్చుని జల్సాలు చేసుకుంటే.. మేమంతా ఏం చేయాలి? హుజూరాబాద్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈటలకు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారు. కాంగ్రెస్‌లో చేరితే బాగుణ్ణు అని రేవంత్ ఎలా అంటారు? పొన్నం ప్రభాకర్ ...నువ్వు మగాడివి అయితే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకో... ఇన్ని రోజులు ఎగిరెగిరి పడ్డారు కదా... కాంగ్రెస్‌కు ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం. రేవంత్, పొన్నం ప్రభాకర్‌కు ఇదే నా సవాల్. కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారు. ఆరు నెలల్లో మొత్తం ఖాళీ అవుతుంది.  రేవంత్ రాకతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పోదెం వీరయ్య, భట్టి విక్రమార్కతో సహా ఎవరూ హ్యాపీగా లేరు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మల్కాజిగిరిలో ఎందుకు డిపాజిట్లు తెచ్చుకోలేదో చెప్పాలి? రాష్ట్రంలో ఏం చేయలేడు... యుద్ధానికి సై అంటే సై అనేటోడు... రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలి. అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. సినిమాలో ముమైత్ ఖాన్‌ వస్తే చప్పట్లు, ఈలలు కొడతారు. కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు... సీఎం సీఎం అంటే సరిపోతుందా’’ అంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. 

Updated Date - 2021-07-12T23:05:21+05:30 IST