హుజురాబాద్ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్‌లను ప్రకటించిన టీపీసీసీ

ABN , First Publish Date - 2021-07-14T15:54:10+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్‌లను టీపీసీసీ ప్రకటించింది. హుజురాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా దామోదర రాజనర్సింహ, సమన్వయకర్తలుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌‌లు వ్యవహరించనున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్‌లను ప్రకటించిన టీపీసీసీ

హైదరాబాద్‌: హుజురాబాద్ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్‌లను టీపీసీసీ ప్రకటించింది. హుజురాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా దామోదర రాజనర్సింహ, సమన్వయకర్తలుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌‌లు వ్యవహరించనున్నారు. వీణవంక మండల ఇన్‌చార్జ్‌లుగా ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, జమ్మికుంట మండల ఇన్‌చార్జ్‌లుగా విజయరమణారావు, రాజ్ ఠాగూర్, జమ్మికుంట టౌన్ ఇన్‌చార్జ్‌లుగా మాజీ ఎంపీ రాజయ్య, ఈర్ల కొమురయ్య, హుజురాబాద్ మండల ఇన్‌చార్జ్‌లుగా టి.నర్సారెడ్డి, లక్ష్మణ్‌ కుమార్, హుజురాబాద్ టౌన్ ఇన్‌చార్జ్‌లుగా బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు, ఇల్లంతకుంట మండల ఇన్‌చార్జ్‌లుగా నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలాపూర్ మండల ఇన్‌చార్జ్‌లుగా కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్యను నియమించారు.


Updated Date - 2021-07-14T15:54:10+05:30 IST