కరోనా మృతుల కుటుంబాలకు రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: వీహెచ్‌

ABN , First Publish Date - 2021-05-30T09:48:34+05:30 IST

కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రెండు లక్షలు నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీ వి. హన్మంతరావు డిమాండ్‌ చేశారు.

కరోనా మృతుల కుటుంబాలకు రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: వీహెచ్‌

సీఎంను కలిసేందుకు ప్రగతిభవన్‌కు.. అనుమతించని పోలీసులు

బేగంపేట, మే 29 (ఆంధ్రజ్యోతి): కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రెండు లక్షలు నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీ వి. హన్మంతరావు డిమాండ్‌ చేశారు. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి ఆయన ప్రగతిభవన్‌కు వచ్చారు. అయితే అనుమతి లేదని పోలీసులు అయనను లోపలకు అనుమతించలేదు. అనంతరం వీహెచ్‌ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అనుమతించడం లేదన్నారు. ముఖ్యమంత్రిని కలిసేవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని కూర్చున్న వీహెచ్‌ను కొంతసేపటి తర్వాత పోలీసులు పంపించి వేశారు.

Updated Date - 2021-05-30T09:48:34+05:30 IST