మెరుగైన ఫిట్‌మెంట్‌ కోసం చర్చిస్తున్నాం

ABN , First Publish Date - 2021-02-06T09:51:42+05:30 IST

ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్‌ కోసం చర్చలు జరుగుతున్నాయని టీఎన్జీవో సెంట్రల్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఎం.రాజేందర్‌ తెలిపారు. మూడు లక్షల

మెరుగైన ఫిట్‌మెంట్‌ కోసం చర్చిస్తున్నాం

ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా చర్చలు

ప్రచారం కోసం విమర్శలు వద్దు: టీఎన్జీవో


చిక్కడపల్లి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్‌ కోసం చర్చలు జరుగుతున్నాయని టీఎన్జీవో సెంట్రల్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఎం.రాజేందర్‌ తెలిపారు. మూడు లక్షల మంది ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రచారం కోసం విమర్శలు చేయడం తగదని అన్నారు. సిటీ సెంట్రల్‌ లైబరీ గ్రేడ్‌-2 లైబ్రేరియన్‌ దేవేందర్‌ పదవీ విరమణ వీడ్కోలు సభ శుక్రవారం చిక్కడపల్లిలో జరిగింది. ఈ సందర్భంగా రాజేందర్‌ మాట్లాడారు. ఫిట్‌మెంట్‌ విషయంలో ఉద్యోగులకు నష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత టీఎన్‌జీవో యూనియన్‌పై ఉందన్నారు. పీఆర్‌సీ ఇప్పించేందుకు సీఎం కేసీఆర్‌తో సంప్రదింపులు జరిపి కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వానికి విన్నవించామని తెలిపారు. 

Updated Date - 2021-02-06T09:51:42+05:30 IST