మంచిర్యాల జిల్లాలో మరోసారి పులి కలకలం

ABN , First Publish Date - 2021-02-09T01:56:36+05:30 IST

జిల్లాలో మరోసారి పులి సంచారం బయటపడింది. భీమారం మండలంలోని కాజీపల్లి అడవిలో పశువులపై పులి దాడి చేసింది.

మంచిర్యాల జిల్లాలో మరోసారి పులి కలకలం

మంచిర్యాల: జిల్లాలో మరోసారి పులి సంచారం బయటపడింది. భీమారం మండలంలోని కాజీపల్లి అడవిలో పశువులపై పులి దాడి చేసింది. ఈ దాడిలో గేదె మృతి చెందింది. గతంలో కోటపల్లి మండలం నక్కలపల్లి  గ్రామ శివారులో, వేమనపల్లి మండలం కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం మరువకముందే తాజాగా ఈ ఘటన జరిగింది. పులి సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. పులి దాడితో సమీపాన ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2021-02-09T01:56:36+05:30 IST