కాటారం మండలంలో పులి కలకలం

ABN , First Publish Date - 2021-12-07T08:02:14+05:30 IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. శంకరంపల్లి సమీపంలోని ఏఎంసీ గోడౌన్‌ వద్ద

కాటారం మండలంలో పులి కలకలం

కాటారం, డిసెంబరు 6: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. శంకరంపల్లి సమీపంలోని ఏఎంసీ గోడౌన్‌ వద్ద ఆదివారం రాత్రి  ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా పులి రోడ్డు దాటడంతో సర్పంచ్‌ అశోక్‌తో పాటు గ్రామస్థులకు సమాచారం అందించాడు. ఉదయాన్నే ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా పులి పాదముద్రలు కనిపించాయి. ఇదే క్రమంలో ఒడిపిల వంచ శ్మాశాన వాటిక వద్ద ఆవు దూడను పులి చంపినట్టు ఆనవాలు కనిపించాయి. ఆవుదూడ మెడపై గాయాలను బట్టి పెద్ద పులే చంపినట్లు అధికారులు నిర్ధారించారు. 

Updated Date - 2021-12-07T08:02:14+05:30 IST