9న కేఆర్‌ఎంబీ త్రీమెన్‌ కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2021-12-07T08:14:32+05:30 IST

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) త్రీమెన్‌ కమిటీ సమావేశం ఈనెల 9న జరుగనుంది. వర్చువల్‌ విధానంలో జరిగే

9న కేఆర్‌ఎంబీ త్రీమెన్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) త్రీమెన్‌ కమిటీ సమావేశం ఈనెల 9న జరుగనుంది. వర్చువల్‌ విధానంలో జరిగే ఈ సమావేశంలో యాసంగిలో వ్యవసాయ, తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం గురించి కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి డి.ఎం.రాయిపూరే తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలకు లేఖ రాశారు. త్రీమెన్‌ కమిటీలో కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌తో పాటు తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు సభ్యులుగా ఉంటారు. 

Updated Date - 2021-12-07T08:14:32+05:30 IST