కారు, ఆటో ఢీ.. ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-02-05T07:28:28+05:30 IST

వేగంగా దూసుకొచ్చిన కారు (తుఫాన్‌ వాహనం) ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలో గురువారం జరిగింది...

కారు, ఆటో ఢీ.. ముగ్గురి మృతి

జగదేవ్‌పూర్‌, ఫిబ్రవరి 4: వేగంగా దూసుకొచ్చిన కారు (తుఫాన్‌ వాహనం) ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలో గురువారం జరిగింది. చాట్లపల్లికి చెందిన బి.శ్రీశైలం(40), గడ్డం కనకయ్య (42), బరిగే రమేష్‌ (41) ఆటోలో జగదేవపూర్‌కు బయలు దేరగా, గొల్లపల్లికి రాగానే అదే గ్రామానికి చెందిన సుజాత, కనకమ్మ ఇదే ఆటోలో ఎక్కారు. ఈ సమయంలో ఎదురుగా వేగంతో దూసుకొచ్చిన కారు.. ఆటోను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన  రమేష్‌, శ్రీశైలం, కనకయ్య అక్కడక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన సుజాత, కనకమ్మలను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-02-05T07:28:28+05:30 IST