మూడు రోజులు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2021-11-23T08:29:23+05:30 IST

రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మూడు రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తువరకు వ్యాపించి ఉన్నట్లు, తూర్పు ఆగ్నేయ దిశల నుంచి కిందిస్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 48 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది.

Updated Date - 2021-11-23T08:29:23+05:30 IST