మూడు రోజులు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2021-06-22T08:49:32+05:30 IST

రాష్ట్రంలో మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మూడు రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయిలో గాలులు వీస్తున్నట్లు తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. సాధారణం కంటే భద్రాచలంలో 2.3, హైదరాబాద్‌లో 1.1, ఖమ్మంలో 1.1, నల్లగొండలో 3.2, మహబూబ్‌నగర్‌లో 1.1, నిజామాబాద్‌లో 0.8, రామగుండంలో 0.6, హన్మకొండలో 0.4 డిగ్రీలు పెరిగినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Updated Date - 2021-06-22T08:49:32+05:30 IST