మోల్నుపిరావిర్‌పై మూడో దశ పరీక్షలు
ABN , First Publish Date - 2021-05-20T08:33:24+05:30 IST
మోల్నుపిరావిర్‌పై మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి ఆప్టిమస్ ఫార్మాకు డీసీజీఐ అనుమతిచ్చింది.

2,500 మందిపై అధ్యయనం.. డీసీజీఐ అనుమతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మోల్నుపిరావిర్‌పై మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి ఆప్టిమస్ ఫార్మాకు డీసీజీఐ అనుమతిచ్చింది. ఒక మాదిరి నుంచి స్వల్ప లక్షణాలున్న కరోనా రోగులకు మోల్నుపిరావిర్‌ను వాడుతున్నారు. మోల్నుపిరావిర్ ఫార్ములేషన్, దానికి అవసరమైన ఏపీఐని కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసుకున్నట్లు ఆప్టిమస్ ఫార్మా వెల్లడించింది. అనుమతించిన ప్రొటోకాల్ ప్రకారం 2,500 మందిపై అధ్యయనం నిర్వహిస్తారు. వీరిలో స్వల్ప, ఒక మాదిరి తీవ్రత కలిగిన కొవిడ్ రోగులు ఉంటారు. ఈ పరీక్షలు కొవిడ్ రోగులపై ఔషధం సమర్థతను తెలియజేస్తాయని ఆప్టిమస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. దేశీయ మార్కెట్లో కొవిడ్ చికిత్స కోసం యాంటీ వైరల్ ఔషధాలకు గిరాకీ అనూహ్యంగా పెరిగిపోతోందని.. దీన్ని అధిగమించడానికి తాము ఉత్పత్తి చేసే మోల్నుపిరావిర్ దోహదం చేయగలదన్నారు.