రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు

ABN , First Publish Date - 2021-01-13T07:56:31+05:30 IST

తెలంగాణలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. పౌలీ్ట్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. బర్డ్‌ఫ్లూ భయాందోళనల నేపథ్యంలో.. మంత్రి ఈటల

రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు

చికెన్‌, గుడ్లతో ప్రమాదమూ లేదు!

1300 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు..

పౌలీ్ట్ర పరిశ్రమను ఆదుకునేందుకు సిద్ధం

మంత్రులు తలసాని, ఈటల రాజేందర్‌

తెలంగాణలో వందల్లో పక్షుల మృతి

‘కొక్కెర’ అంటున్న వైద్యులు


హైదరాబాద్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. పౌలీ్ట్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. బర్డ్‌ఫ్లూ భయాందోళనల నేపథ్యంలో.. మంత్రి ఈటల రాజేందర్‌, చేవెళ్ళ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డితో కలసి.. పౌలీ్ట్ర పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తలు, పశువైద్యశాఖ అధికారులతో మంగళవారం ఆయన సమీక్షాసమావేశం నిర్వహించారు. బర్డ్‌ఫ్లూ నియంత్రణకు ప్రభుత్వం తీసుకొంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలను వారికి వివరించారు. అనంతరం.. తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పౌలీ్ట్ర పరిశ్రమ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు పౌలీ్ట్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నామన్నారు. చికెన్‌, గుడ్లు తినడం వల్లఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదమూ లేదని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ బయటపడిన వెంటనే అధికారులను అప్రమత్తం చేశామన్నారు. 1,300 రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. 


సరిహద్దు జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. నల్గొండ, వరంగల్‌, పెద్దపల్లి జిల్లాల్లో కోళ్లు మృతి చెందినట్లు మీడియాలో వచ్చిన వార్తలకు ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలిపారు. 276 నమూనాలను వైద్య పరీక్షలకు పంపగా.. నెగెటివ్‌ రిపోర్టులు వచ్చాయన్నారు. గడిచిన3రోజుల్లో వెయ్యి నమూనాలను పరీక్షించారని చెప్పారు. విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి వచ్చే వలస పక్షుల సంఖ్య చాలా పరిమితమని తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. గతంలో బర్డ్‌ఫ్లూతో పౌలీ్ట్ర పరిశ్రమకు మాత్రమే నష్టం వాటిల్లిందన్నారు. మనుషులు ప్రమాదంలో పడిన దాఖలాలు లేవన్నారు. మన శరీరానికి తక్కువ ఖర్చుతో ప్రోటీన్లను అందించే శక్తి.. చికెన్‌, గుడ్లకు మాత్రమే ఉందని చెప్పారు. వాటిని బాగుగా ఉడికించి తినాలని సూచించారు. ఈ సమావేశంలో పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, వైద్యారోగ్య కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T07:56:31+05:30 IST