మెషీన్‌ ట్రాన్స్‌లేషన్‌కు పరిమితులున్నాయ్‌

ABN , First Publish Date - 2021-11-21T08:20:17+05:30 IST

ఒక భాష నుంచి మరో భాషలోకి తర్జుమా చేసేందుకు మెషీన్‌ ట్రాన్స్‌లేటర్ల వినియోగంలో పలు పరిమితులు ఉన్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు.

మెషీన్‌ ట్రాన్స్‌లేషన్‌కు పరిమితులున్నాయ్‌

  • భాషల్లోని పదాల వైరుధ్యాలే అవరోధం 
  • ‘ఐఐఐటీహెచ్‌ -వికీ మీడియా’ సదస్సులో వక్తలు 


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఒక భాష నుంచి మరో భాషలోకి తర్జుమా చేసేందుకు మెషీన్‌ ట్రాన్స్‌లేటర్ల వినియోగంలో పలు పరిమితులు ఉన్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఒక్క తెలుగుభాషను వికీ మీడియాలో చేర్చాలంటే 40కిపైగా వాల్యూమ్స్‌ను పొందుపర్చాల్సి ఉంటుందన్నారు. ప్రతి భాషలో పదాలకు ఉన్న ప్రత్యేకతలు, వైరుధ్యాలు మెషీన్‌ ట్రాన్స్‌లేషన్‌ను క్లిష్టంగా మార్చుతాయని పేర్కొన్నారు. కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖ ఆధ్యర్యంలో తెలంగాణ ప్రభుత్వం, ఫిక్కీ, ఐఏఐఏ, మీడియా వికీ, ఐఐఐటీహెచ్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘వికీమీడియా టెక్నాలజీ ఆన్‌లైన్‌ సమ్మిట్‌ -2021’ వర్చువల్‌ సదస్సులో పలువురు ప్రముఖులు ఈవిషయాలను వెల్లడించారు. తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో మంచి అర్థాన్నిచ్చే ఎన్నో పదాలున్నాయని.. వాటన్నింటిని వాడుకలోకి తీసుకొచ్చి వినియోగిస్తేనే సమర్థం గా మెషీన్‌ ట్రాన్స్‌లేషన్‌కు వెసులుబాటు కలుగుతుందన్నా రు. కార్యక్రమంలో ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ టీ.వీ.ప్రభాకర్‌, ట్రిపుల్‌ఐటీహెచ్‌ ప్రొఫెసర్‌ వాసుదేవ వర్మ, ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, ప్రొఫెసర్‌ పుష్పక్‌ భట్టాచార్య, ప్రొఫెసర్‌ ప్రభా ఛటర్జీ, ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాధిక మామిడి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-21T08:20:17+05:30 IST