అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీ
ABN , First Publish Date - 2021-12-30T18:12:04+05:30 IST
మహబూబాబాద్ అయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవనంబూద్రి తెలిపారు.

మహబూబాబాద్ రూరల్, డిసెంబరు 29 : మహబూబాబాద్ అయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవనంబూద్రి తెలిపారు. అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలో చొరబడి హుండీని పగులగొట్టి అందు లో ఉన్న సుమారు రూ.2లక్షల నగదును ఎత్తుకువెళ్లినట్లు చెప్పారు. ఈ విషయమై మహబూబాబాద్ టౌన్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.