నిమ్స్‌లో ల్యాబ్‌లన్నీ ఒకే చోట
ABN , First Publish Date - 2021-01-20T09:11:25+05:30 IST
నిమ్స్‌లో పరీక్షలంటే రోగులు పరుగులు పెట్టేవారు. ఒక్కో పరీక్ష ఒక్కో బ్లాక్‌లో ఉండటంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనేవారు.

రూ. 5కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు
హైదరాబాద్ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో పరీక్షలంటే రోగులు పరుగులు పెట్టేవారు. ఒక్కో పరీక్ష ఒక్కో బ్లాక్‌లో ఉండటంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు అన్ని పరీక్షల్ని ఒకేచోట చేయించుకునే అవకాశం లభ్యమవనుంది. మిలినియం బ్లాక్‌లోని 5వ అంతస్తులో అన్ని పరీక్షల్ని చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడానికి ఇక్కడ దాదాపు రూ. 5కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. నిమ్స్‌లో ప్రతి ఏడాది దాదాపు మూడు లక్షల మంది వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటారని అంచనా.