బదిలీని తట్టుకోలేక ఉపాధ్యాయుడు మృతి

ABN , First Publish Date - 2021-12-31T02:34:05+05:30 IST

బదిలీని తట్టుకోలేక ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన

బదిలీని తట్టుకోలేక ఉపాధ్యాయుడు మృతి

మహబూబాబాద్: బదిలీని తట్టుకోలేక ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది. నెల్లికుదురు మండలంలోని చిన్న ముప్పారం ప్రభుత్వ పాఠశాలలోఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయుడిగా జేత్ రామ్  పనిచేస్తున్నాడు. అయితే అక్కడి నుంచి ములుగు జిల్లాకు బదిలీ అయ్యాడు. బదిలీతో మనస్థాపానికి గురై మహబూబాబాద్‌లోని తన ఇంట్లో అపస్మారక స్థితిలోకి జేత్ రామ్ పడిపోయాడు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. జేత్‌రామ్‌ భార్య అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. స్పౌజ్‌ ఉన్నా బదిలీ చేయడంపై కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2021-12-31T02:34:05+05:30 IST