కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2021-05-02T09:08:54+05:30 IST

వైద్య ఆరోగ్య శాఖాధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తూ చక్కగా పని చేయాలని, కరోనా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

మందులు, పడకల లభ్యతలో లోపాలుండొద్దు: ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, మే 1(ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖాధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తూ చక్కగా పని చేయాలని, కరోనా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మంత్రి ఈటల రాజేందర్‌ పర్యవేక్షిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ శనివారం కేసీఆర్‌కు బదిలీ అయింది. ఆ వెంటనే సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతి రోజూ మూడు సార్లు సమీక్ష నిర్వహించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. రెమ్‌డెసివిర్‌తోపాటు ఇతర మందులు, ఆక్సిజన్‌, పడకల లభ్యత, వ్యాక్సిన్ల విషయంలో ఏ మాత్రం లోపాలు రానీయొద్దని సూచించారు. కరోనాపై అనుక్షణం పర్యవేక్షణ కోసం తన కార్యాలయ(సీఎంవో) కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డిని కేసీఆర్‌ నియమించారు.

Updated Date - 2021-05-02T09:08:54+05:30 IST