ఈటల రాజేందర్‌పై నివేదిక అసంబద్ధం

ABN , First Publish Date - 2021-05-05T08:17:25+05:30 IST

భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై అధికారులు రూపొందించిన నివేదిక అసంబద్ధంగా ఉందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు.

ఈటల రాజేందర్‌పై నివేదిక అసంబద్ధం

ప్రభుత్వ తీరు కక్షపూరితం: కోదండరాం

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై అధికారులు రూపొందించిన నివేదిక అసంబద్ధంగా ఉందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. నివేదికలోని అంశాలన్నీ తప్పుగా ఉన్నాయన్నారు. అసైన్డ్‌  భూములను కబ్జా చేశారని చెప్పే అంకెలకు పొంతన లేదన్నారు. ఈ నివేదిక చూస్తుంటే ఈటలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందని తెలిపారు.  

Updated Date - 2021-05-05T08:17:25+05:30 IST