ప్రధానిది గొప్ప మనసు: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2021-05-30T09:38:03+05:30 IST

కరోనా దెబ్బకు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారుల విషయం లో ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశంసించారు.

ప్రధానిది గొప్ప మనసు: బండి సంజయ్‌

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): కరోనా దెబ్బకు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారుల విషయం లో ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశంసించారు.  దీనిని స్వాగతిస్తూ తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పూర్తి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని ప్రకటించడం గొప్ప విషయం. పీఎం కేర్స్‌ ద్వారా వారికి కేంద్రం ఉచిత విద్యను అందిస్తుంది. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా రూ.5 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమి యం చెల్లిస్తుంది. ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్‌ లోన్‌ ఇప్పించి, దాని వడ్డీని కేంద్ర మే భరిస్తుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత వారికి స్టైపెండ్‌ ఇస్తారు. 23 ఏళ్లు నిండాక రూ.10లక్షలను నేరుగా పీఎం కేర్స్‌ నుంచి అందిస్తారు. అలాంటి చిన్నారుల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రానికి పంపాలి’’అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-05-30T09:38:03+05:30 IST