ఏటీఎం వద్ద మోసపోయిన వృద్ధుడు

ABN , First Publish Date - 2021-05-21T06:24:00+05:30 IST

ఏటీఎం వద్ద మోసపోయిన వృద్ధుడు

ఏటీఎం వద్ద మోసపోయిన వృద్ధుడు

రూ.2 లక్షలు డ్రా చేసి ఉడాయించిన అపరిచిత వ్యక్తి

వెంకటాపురం(నూగూరు), మే 20: ఏటీఎం సెంటర్‌లో వృద్ధుడిని ఓ వ్యక్తి మోశాడు. ఏటీఎం నుంచి రూ.2లక్షల నగదును డ్రా చేసి ఉడాయించాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. స్థానిక ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొయ్యల లాల య్య  ఏప్రిల్‌ 20న  డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏ టీఎం సెంటర్‌కు వెళ్లాడు. నిరక్షరాస్యుడు కావడంతో ఏటీఎం సెంటర్‌ వద్ద ఉన్న అపరిచిత వ్యక్తి సహాయం కోరాడు. అతడు ఇదే అదనుగా భావించి వృద్ధుడి ఏటీ ఎం పిన్‌ నెంబర్‌ చోరీ చేసి రూ.2 లక్షల నగదును డ్రా చేసుకుని అదృశ్యమయ్యాడు. బాధితుడు లాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏటీఎం సెంటర్‌లో సీసీ ఫుటేజీ ఆధారంగా వృద్ధుడిని మోసం చేసిన వ్యక్తి ఫొటోలను పోలీసులు గుర్తించి గురువారం విడుదల చేశారు. ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


Updated Date - 2021-05-21T06:24:00+05:30 IST