త్వరలో టీడీపీ-టీఎస్‌కు కొత్తఅధ్యక్షుడు

ABN , First Publish Date - 2021-07-12T08:20:45+05:30 IST

టీడీపీ-టీఎస్‌ నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆదివారం కూడా జూమ్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శులు,

త్వరలో టీడీపీ-టీఎస్‌కు కొత్తఅధ్యక్షుడు

పార్టీ నేతలతో చంద్రబాబు చర్చలు ముగింపు


టీడీపీ-టీఎస్‌ నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆదివారం కూడా జూమ్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకుల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకున్నారు. టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా తాము ఐక్యంగా పనిచేస్తామని వారు తెలిపారు. సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు. త్వరలో కొత్త అధ్యక్షుడి పేరును తమ పార్టీ అధినేత ప్రకటిస్తారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-12T08:20:45+05:30 IST