పరిహారం ఇచ్చాకే పనులు ప్రారంభించాలి
ABN , First Publish Date - 2021-02-06T09:40:30+05:30 IST
పరిహారం ఇచ్చాకే పనులు ప్రారంభించాలి

కిష్టరాయన్‌పల్లి భూనిర్వాసితుల ఆమరణ దీక్ష
నాంపల్లి, ఫిబ్రవరి 5: కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్ పనులను పూర్తి నష్టపరిహారం అందించిన తర్వాతే ప్రారంభించాలని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. డిండి పథకంలో భాగంగా నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణపురంలో నిర్మిస్తున్న కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్‌లో భూములు, ఆవాసాలు కోల్పోతున్న నిర్వాసితులు శుక్రవారం ఆమరణ దీక్ష ప్రారంభించారు. దీక్ష చేస్తున్న వట్టికోటి నరేశ్, గడ్డి యాదయ్య, బానవత్ నరేందర్, గణేశ్ మాట్లాడారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు అందించిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ తరహాను తమకు కూడా వర్తింపజేసేవరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు.