కందూరులోని చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించాలి

ABN , First Publish Date - 2021-06-23T10:53:33+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లా కందూరులో బయల్పడిన ఇనుప యుగపు కాలం నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్‌, కల్చరర్‌ సెంటర్‌ సీఈఓ డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి కోరారు.

కందూరులోని చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించాలి

పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా కందూరులో బయల్పడిన ఇనుప యుగపు కాలం నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్‌, కల్చరర్‌ సెంటర్‌ సీఈఓ డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి కోరారు. ఈ మేరకు భూత్‌పూర్‌ రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అడ్డాకుల మండలంలోని కందూరును ఆయన మంగళవారం సందర్శించారు. అనంతరం శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. గత వైభవ ప్రాభవాలకు అద్ధం పట్టే అలనాటి శిలలు, శిల్పాలు కనుమరుగవుతుండటం బాధాకరమన్నారు. ఆలయ పరిసరాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న చారిత్రక వీరుల శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు, స్తంభాలను ఒకచోట చేర్చి పరిరక్షించాలని గ్రామ సర్పంచికి, ఆలయ కమిటీ ఛైర్మన్‌కి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-06-23T10:53:33+05:30 IST