ఆంక్షలపై సంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-12-31T08:16:20+05:30 IST

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నగరంలోని పబ్‌లపై ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేయడంపై రాష్ట్ర హైకోర్టు సంతృప్తి వ్య క్తం చేసింది.

ఆంక్షలపై సంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నగరంలోని పబ్‌లపై ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేయడంపై రాష్ట్ర హైకోర్టు సంతృప్తి వ్య క్తం చేసింది. అయితే, ఆ ఆదేశాలను వంద శాతం అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. పబ్స్‌ వల్ల ఏర్పడే శబ్ద కాలుష్యం కంటే కరోనా వైరస్‌ వ్యాప్తి పెద్ద సమస్య అని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒమైక్రాన్‌ వేరియంట్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తొలిసారిగా ఆంక్షలు విధించిందని, ఇది స్వాగతించదగ్గ పరిణామమని జస్టిస్‌ విజయ్‌కాంత్‌రెడ్డి ధర్మాసనం పేర్కొంది. జూబ్లీహిల్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... శబ్ద కాలుష్యంపై శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శబ్ద కాలుష్యం గురించి ఫిర్యాదు చేేసందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటుచేయాలని కోరారు. 

Updated Date - 2021-12-31T08:16:20+05:30 IST