ధాన్యం కొనుగోలు వివాదానికి ముగింపు పలకాలి

ABN , First Publish Date - 2021-12-25T08:08:39+05:30 IST

యాసంగి ధాన్యం కొనుగోలు వివాదానికి ముగింపు పలికేలా కేంద్ర

ధాన్యం కొనుగోలు వివాదానికి ముగింపు పలకాలి

 కేంద్రం చొరవ తీసుకోవాలి: రాష్ట్ర రైతు రక్షణ సమితి

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): యాసంగి ధాన్యం కొనుగోలు వివాదానికి ముగింపు పలికేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు అన్నారు. అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వమే అడుగడుగునా ఇబ్బందులు కలిగిస్తోందనే భావనలో రైతులు ఉన్నారని చెప్పారు. యాసంగిలో వరి సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర విమర్శల నేపథ్యంలో రైతులు నలిగిపోతున్నారన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని చెప్పారు. రైతులకు వచ్చే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? స్పష్టం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని శ్రీహరి రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-25T08:08:39+05:30 IST