దేశానికి యువతే ఆధారం..యువోత్సవ్‌-2021లో గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై

ABN , First Publish Date - 2021-01-13T09:26:18+05:30 IST

‘‘సినిమా హీరోలకు క్షీరాభిషేకం చేస్తుంటారు. సమస్తమైన శక్తి మీలోనే ఉంది. ప్రతి యువకుడు ఒక హీరో. మీరే నిజమైన హీరోలుగా భావించుకొని గొప్ప పనులు చే యాలి’’ అని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై

దేశానికి యువతే ఆధారం..యువోత్సవ్‌-2021లో గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ‘‘సినిమా హీరోలకు క్షీరాభిషేకం చేస్తుంటారు. సమస్తమైన శక్తి మీలోనే ఉంది. ప్రతి యువకుడు ఒక హీరో. మీరే నిజమైన హీరోలుగా భావించుకొని గొప్ప పనులు చే యాలి’’ అని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ యువతకు పిలుపు ఇచ్చారు. స్వామి వివేకానందుని జయంతి ని పురస్కరించుకొని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇం డియా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన యువోత్సవ్‌-2021 జాతీ య సదస్సులో ఆమె వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు. దేశానికి యువతే ఆధారం అన్నారని, తానీ స్థాయికి చేరుకోవడం వెనుక స్వామి వివేకానందుని బోధనలే కారణమని తెలిపారు.  పలువురు చిన్నచిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటారని, వివేకానందుని రచనలు చదివితే వారు కచ్చితంగా ఆత్మహత్యలు చేసుకోరని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, మౌలానా ఆజాద్‌ ఉర్దూ వర్సిటీ ఇన్‌చార్జీ వీసీ ప్రొఫెసర్‌ రహమతుల్లా, ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, కంపెనీ సెక్రటరీస్‌ ఇండియా అధ్యక్షుడు ఆశీ్‌షగార్గ్‌ తదితరులు పాల్గొన్నారు. 


గవర్నర్‌తో పలువురి భేటీ

గవ ర్నర్‌ను మంగళవారం రాజ్‌భవన్‌లో పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారిలో కస్టమ్స్‌ చీఫ్‌ కమిషనర్‌ మల్లికా ఆర్య, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌గోయల్‌, జాయింట్‌  ఎన్నికల ప్రధాన అధికారి టి.రవికిరణ్‌ ఉన్నారు. 

Updated Date - 2021-01-13T09:26:18+05:30 IST