దొర అహంకారాన్ని దించాలి: షర్మిల

ABN , First Publish Date - 2021-12-31T08:36:43+05:30 IST

సీఎం కేసీఆర్‌ పాలనలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోనిరోజు ఎప్పు డు వస్తుందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

దొర అహంకారాన్ని దించాలి: షర్మిల

సీఎం కేసీఆర్‌ పాలనలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోనిరోజు ఎప్పు డు వస్తుందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ఆత్మహత్యలు ఆగాలంటే దొరగారి అహంకారాన్ని దించాలని ఆమె పిలుపునిచ్చారు. ‘ఓరోజు నోటిఫికేషన్లు లేక చనిపోయే నిరుద్యోగి వంతు.. ఓరోజు పంట కొనకపోవడంతో చచ్చే రైతువంతు.. ఓరోజు ధరణి తప్పుల తడకకు చనిపోయే రైతువంతు.. ఓరోజు ఆర్టీసీ ఉద్యోగుల వంతు.. ఓరోజు వైద్యం అందని కరోనా రోగుల వంతు.. ఇదే కేసీఆర్‌ పాలనలో బతకలేని తెలంగాణ’ అని ట్వీట్‌ చేశారు. 


ఏకే ఖాన్‌ పదవీ కాలం పెంపు

ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది  పొడిగించింది. ఈ నెల 31 నుంచి ఏడాది పాటు పొడిగింపు వర్తిస్తుందని  ప్రభు త్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2021-12-31T08:36:43+05:30 IST