దేవుడు పంపిన సోదరుడు ‘పల్లా’
ABN , First Publish Date - 2021-03-22T05:07:23+05:30 IST
దేవుడు పంపిన సోదరుడు ‘పల్లా’

- కరుడుగట్టిన కార్యకర్తలను కాపాడుకుంటా
- ఏక నాయకత్వంలో పని చేయాలి
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్‌ఘన్‌పూర్, మార్చి 21 : నియోజకవర్గ అభివృద్ధి తనతో పాటు పనిచేసే సోదరుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని దేవుడు పంపాడని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఆదివారం డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతీ కార్యకర్త గ్రామాల వారిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి వారే అనుకొని ప్రచారం నిర్వహించి పల్లాను గెలిపించారన్నారు. నియోజకవర్గానికి వచ్చే ఎవరైనా ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఏక నాయకత్వంలోనే పని చేయాలని ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరుగుతాయనిపేర్కొన్నారు. ప్రతీ కార్యకర్త రెండు నెలల పాటు ఓపికతో ఉండాలన్నారు. గ్రామ, మండలస్థాయి కమిటీల ఏర్పాటు ఉంటుందన్నారు. కరుడుకట్టిన కార్యకర్తలకు పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, కుడా అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఆకుల కుమార్, పార్టీ మండలాధ్యక్షులు గట్టు రమేశ్‌గౌడ్, మహేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా నాయకుడు పోలెపల్లి రంజిత్ రెడ్డి, జడ్పీటీసీ ఇల్లెందుల బేబి, ఎంపీపీలు కందుల రేఖ, చిట్ల జయశ్రీ, నాయకులు పాల్గొన్నారు.