మందుల షాపుల తనిఖీ

ABN , First Publish Date - 2021-03-23T05:26:18+05:30 IST

మందుల షాపుల తనిఖీ

మందుల షాపుల తనిఖీ
జనగామలో మందుల షాపును తనఖీ చేస్తున్న అధికారి రశ్మి

జనగామ కల్చరల్‌, మార్చి 22: జనగామ జిల్లా కేంద్రంలోని మందుల షాపులను సోమవారం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.రశ్మి తనిఖీ చేశారు. పట్టణంలోని పలు హాస్పిటల్స్‌కు అటాచ్డ్‌గా ఉన్న మెడికల్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఫార్మసిస్టు పర్యవేక్షణలో మందులు అమ్ముతున్నారా, నిల్వ ఉన్న మందుల వివరాలు, వాటి బిల్లులు, భద్రపరిచే విధానం, ఎన్‌పీపీఏ నిబంధనలకు లోబడి మందుల ధరలు నిర్ణయించబడ్డాయా.. వంటి వివరాలు తెలుసుకున్నారు. వివరాలను సంబంధిత అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు పంపి వారి ఆదేశానుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2021-03-23T05:26:18+05:30 IST