పదో తరగతి విద్యార్థినికి కరోనా

ABN , First Publish Date - 2021-03-23T05:09:33+05:30 IST

పదో తరగతి విద్యార్థినికి కరోనా

పదో తరగతి విద్యార్థినికి కరోనా

మహదేవపూర్‌, మార్చి 22 : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని కరోనా బారినపడింది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు సోమవారం వైద్య పరీక్ష నిర్వహించగా ఈ మేరకు నిర్ధారణ అయ్యింది. ఈ బాలికతో పాటు మరో 60 మందికి కూడా టెస్టు చేయించగా అందరికీ నెగెటివ్‌ అని తేలింది. విద్యార్థినికి కరోనా నిర్ధారణ కావడంతో ఉపాధ్యాయ వర్గం పాఠశాలను శానిటైజ్‌ చేయించింది. పాఠశాలను మాత్రం యథావిధిగా కొనసాగించారు.  

Updated Date - 2021-03-23T05:09:33+05:30 IST