ముగిసిన రాష్ట్ర స్థాయి టెన్ని్‌సవాలీబాల్‌ పోటీలు

ABN , First Publish Date - 2021-11-29T05:26:08+05:30 IST

ముగిసిన రాష్ట్ర స్థాయి టెన్ని్‌సవాలీబాల్‌ పోటీలు

ముగిసిన రాష్ట్ర స్థాయి టెన్ని్‌సవాలీబాల్‌ పోటీలు
పురుషుల ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతున్న మెదక్‌, సిద్దిపేట జట్లు

బాలుర విభాగంలో సిద్దిపేట, బాలికల్లో నిజామాబాద్‌ జట్ల గెలుపు

శంభునిపేట, నవంబరు 28 : తెలంగాణ టెన్నిస్‌ వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రథమ అంతర్‌ జిల్లా టెన్నిస్‌ వాలీబాల్‌ చాంపియన్‌షి్‌ప పోటీలు ఆదివారం ముగిశాయి. శని, ఆదివారాలు నిర్వహించిన ఈ పోటీల్లో 16 పురుషుల, 6 మహిళల జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌లో పురుషుల విభాగంలో సిద్దిపేట జట్టు, మహిళల విభాగంలో నిజామాబాద్‌ జట్టు గెలుపొందింది. స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్‌ పోశాల పద్మస్వామి, జిల్లా యువజన క్రీడల అధికారిణి ఇందిర, మిల్స్‌కాలనీ ఎస్‌ఐ కుమారస్వామి, జగిత్యాల ఎస్‌ఐ ఆరోగ్యం, కళాశాల జబ్బార్‌, యాకయ్యలు విజేతలకు ట్రోఫీ అందజేశారు. ఈ పోటీల్లో రాణించిన క్రీడాకారులను త్వరలో గుంటూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలంగాణ టెన్ని్‌సవాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరసింహం తెలిపారు.

Updated Date - 2021-11-29T05:26:08+05:30 IST