43 మద్యం దుకాణాలకు..ఒకట్రెండు రోజుల్లో టెండర్‌ నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-11-23T09:04:19+05:30 IST

తక్కువ దరఖాస్తులు దాఖలైన 43 మద్యం దుకాణాలకు మళ్లీ టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేసి

43 మద్యం దుకాణాలకు..ఒకట్రెండు రోజుల్లో టెండర్‌ నోటిఫికేషన్‌

క్కువ దరఖాస్తులు దాఖలైన 43 మద్యం దుకాణాలకు మళ్లీ టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేసి.. కొత్తగా దరఖాస్తులను స్వీకరించనుంది. రెండు, మూడు రోజుల తర్వాత ఇప్పటికే దాఖలైన దరఖాస్తులతోపాటు కొత్తవాటిని జతచేసి, లాటరీ తీస్తారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలను ఈ నెల 20న లాటరీ ద్వారా కేటాయించిన విషయం తెలిసిందే. తక్కువ దరఖాస్తుల వచ్చిన దుకాణాల 43 దుకాణాల విషయంలో లాటరీని ఎక్సైజ్‌శాఖ వాయిదా వేసింది. ఆ దుకాణాలపై 48 గంటల్లో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు. ఒకట్రెండ్రోజుల్లో ఈ దుకాణాల లాటరీ తేదీలను ఖరారు చేసి.. వాటిని కూడా డిసెంబరు 1 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-11-23T09:04:19+05:30 IST