తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2021-05-21T17:47:43+05:30 IST
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు వెబ్‌సైట్‌లో టెన్త్ ఫలితాలు వెలువడనున్నాయి. పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,073 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. 2,10,647 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చిందన్నారు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చినట్టు తెలిపారు.
కరోనా కారణంగా గతేడాది మాదిరిగానే ఈసారి సైతం వార్షిక పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యక్ష తరగతులు నిర్వహించిన 44 రోజుల్లో అన్ని పాఠశాలల్లోనూ ఫార్మెటివ్ అసెస్మెంట్ (ఎఫ్‌ఏ-1) పరీక్ష నిర్వహించారు. 20 మార్కుల ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ఐదింతలు పెంచి (100 మార్కులకు) ఫలితాలు సిద్ధం చేశారు. ఈసారి పదోతరగతి వార్షిక పరీక్షలకోసం ఫీజు చెల్లించిన వారందరినీ ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.